మంగళవారం 07 జూలై 2020
National - Jun 26, 2020 , 17:00:12

2 వారాల ముందే.. దేశ‌మంతా క‌మ్మేసిన రుతుప‌వ‌నాలు

2 వారాల ముందే.. దేశ‌మంతా క‌మ్మేసిన రుతుప‌వ‌నాలు

హైద‌రాబాద్‌: నైరుతి రుతుప‌వ‌నాలు దేశం మొత్తం వ్యాపించిన‌ట్లు ఇవాళ భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.  అయితే షెడ్యూల్ క‌న్నా రెండు వారాల ముందే రుతుప‌వ‌నాలు దేశ‌మంతా విస్త‌రించిన‌ట్లు ఐఎండీ పేర్కొన్న‌ది.  సాధార‌ణంగా జూన్ ఒక‌ట‌వ తేదీన కేర‌ళ‌ను తాకే నైరుతి రుతుప‌వ‌నాలు.. చిట్ట‌చివ‌ర‌గా 45 రోజుల త‌ర్వాత రాజ‌స్థాన్‌లోని శ్రీగంగాన‌గ‌ర్‌ను తాకుతాయి.  కానీ ఈసారి రుతుప‌వ‌నాలు త్వ‌ర‌గానే దేశ‌మంతా విస్త‌రించిన‌ట్లు ఐంఎడీ చెప్పింది.  తాజా లెక్క‌ల ప్ర‌కారం జూలై 8వ తేదీ లోగా రుతుప‌వ‌నాలు దేశం మొత్తం విస్త‌రించ‌నున్నట్లు  ఐంఎడీ అంచ‌నా వేస్తున్న‌ది.  

నైరుతి రుతుప‌వ‌నాలు రాజ‌స్థాన్‌, హ‌ర్యానా, పంజాబ్ ప్రాంతాల‌ను ఇవాళ తాకాయ‌ని, దీంతో రుతుప‌వ‌నాలు దేశ‌మంతా చేరిన‌ట్లు ఐఎండీ తెలిపింది. బెంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ అల్ప‌పీడ‌నం వ‌ల్ల మ‌ధ్య‌భార‌తంలో రుతుప‌వ‌నాల వేగం పెరిగిన‌ట్లు ఐఎండీ పేర్కొన్న‌ది.2013లో రుతుప‌వ‌నాలు దేశ‌మంతా జూన్ 16వ తేదీన క‌వ‌ర్ చేసిన‌ట్లు ఐఎండీ వెల్ల‌డించింది. ఆ ఏడాదిని ఉత్త‌రాఖండ్‌లో భీక‌ర వ‌ర‌దలు వ‌చ్చాయి. మ‌ళ్లీ 2013 త‌ర్వాత‌.. ఈ ఏడాది త్వ‌ర‌గా రుతుప‌వ‌నాలు దేశ‌మంతా వ్యాపించిన‌ట్లు ఐఎండీ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు. logo