శుక్రవారం 03 జూలై 2020
National - Jun 25, 2020 , 19:03:14

కేరళలో 7డ్యామ్‌ల నుంచి దిగువకు నీటివిడుదల

కేరళలో 7డ్యామ్‌ల నుంచి దిగువకు నీటివిడుదల

తిరువనంతపురం : రుతుపవనాల ప్రభావంతో కేరళ రాష్ట్రంలో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున పాలనాయంత్రాంగం పసువు హెచ్చరిక జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని పలు డ్యామ్‌ల నుంచి అధికారులు దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. తిరువనంతపురం జిల్లాలోని నెయ్యార్‌ డ్యాం, ఎన్నాకులం జిల్లాలోని భూతతంకెట్‌, ఇడిక్కి జిల్లాలోని మలన్‌కర, పలక్కడ్‌ జిల్లాలోని మోలథరా, వయణాడ్‌ జిల్లాలోని కరపూజ, కొజికో‌‌డ్‌ జిల్లాలోని కుట్టియాడి, కన్నూర్‌ జిల్లాలోని పజాసి డ్యామ్‌లకు వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో దేశంలోని దక్షిణ ద్వీపకల్పంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే కేరళ, మహారాష్ట్రలో వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.logo