గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 25, 2020 , 16:05:51

కోతుల వీరంగం..12 మందికి గాయాలు

కోతుల వీరంగం..12 మందికి గాయాలు

కేంద్రపారా: ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో వానరాలు వీరంగం సృష్టించాయి. బాదమంగరాజ్‌పూర్‌ గ్రామంలోని జనావాసాల్లోకి ప్రవేశించిన కోతుల మంద పలువురిపై దాడి చేశాయి. కోతుల దాడిలో 12 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు బాలురున్నారు. కోతులు పంటపొలాలను కూడా ధ్వంసం చేశాయి. గ్రామాల్లోకి వచ్చి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తోన్న కోతులను అడవిలోకి పంపించాలని అటవీ శాఖాధికారులను కోరినట్లు స్థానిక అధికారి ఒకరు తెలియజేశారు. కోతుల నుంచి కాపాడుకోలేక మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాం. అధికారులు, ఫారెస్ట్‌ సిబ్బంది మా ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని అర్తత్రణ ప్రధాన్‌ అనే వ్యక్తి మండిపడ్డాడు. 


logo
>>>>>>