మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 08, 2020 , 16:12:56

ఇన్‌స్ట్రక్షన్స్‌ చదివి మరీ థర్మాస్‌ ఓపెన్‌ చేసిన కోతి..వీడియో వైరల్‌

ఇన్‌స్ట్రక్షన్స్‌ చదివి మరీ థర్మాస్‌ ఓపెన్‌ చేసిన కోతి..వీడియో వైరల్‌


హైదారాబాద్‌: మనకు ఏదైనా తెలియని కొత్త వస్తువు ఇస్తే ఏం చేస్తాం? మ్యానువల్‌ చదివి ఎలా వాడాలో తెలుసుకుంటాం. ఓ కోతి కూడా అచ్చం ఇలానే చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మనిషి కోతినుంచే వచ్చాడు అనేందుకు ఇది సాక్ష్యంగా నిలిచింది అంటూ పలువురు కామెంట్లు పెట్టారు. 

జార్జ్‌ అనే కోతికి దాని యజమాని ఓ థర్మాస్‌ను బహుమతిగా ఇచ్చాడు. అది వెంటనే మనిషిలాగా ఆ బాక్స్‌ ఓపెన్‌ చేసి, మొదట మ్యానువల్‌ తీసి, చదివింది. అనంతరం థర్మాస్‌ ఓపెన్‌ చేసింది. మళ్లీ ఏం డౌట్‌ వచ్చిందో, మళ్లొకసారి మ్యానువల్‌ చదివింది. దీన్ని ఆ యజమాని వీడియో తీసి, సోషల్‌ మీడియాలో పెట్టగా, నెటిజన్లు చూసి ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇంకెందుకాలస్యం మీరూ ఆ వీడియో చూసేయండి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo