శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Nov 09, 2020 , 01:35:03

ఈపీఎఫ్‌వో దీపావళి గిఫ్ట్‌

ఈపీఎఫ్‌వో దీపావళి గిఫ్ట్‌

న్యూఢిల్లీ:  పీఎఫ్‌ అకౌంట్‌ కలిగినవారికి  గత ఆర్థిక సంవత్సరం పీఎఫ్‌లోని మొత్తం వడ్డీలో 8.15 శాతం వారి ఖాతాల్లో జమ చేసేందుకు ఈపీఎఫ్‌వో సిద్ధమవుతున్నది. దీపావళికల్లా ఈ డబ్బు ఖాతాల్లో చేరుతుంది. పీఎఫ్‌ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీ మొత్తాన్ని  2020 డిసెంబర్‌ 31 నాటికల్లా జమచేస్తామని ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డు సెప్టెంబర్‌లోనే ప్రకటించింది. ఈ వడ్డీని రెండు విడతల్లో చందాదారులకు అందిస్తామని పేర్కొన్నది. తొలివిడత కింద 8.15 శాతం, రెండో విడత కింద 0.35 శాతం వడ్డీని అందిస్తామని వివరించింది. 8.15 శాతం వడ్డీ మొత్తాన్ని దీపావళికల్లా జమ చేయనుంది.