బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 06, 2020 , 15:01:27

డ‌బ్బు సుర‌క్షితంగానే ఉంది.. యెస్ డిపాజిట‌ర్ల‌కు సీతారామ‌న్‌ హామీ

డ‌బ్బు సుర‌క్షితంగానే ఉంది.. యెస్ డిపాజిట‌ర్ల‌కు సీతారామ‌న్‌ హామీ

హైద‌రాబాద్‌:  యెస్ బ్యాంకు డిపాజిట‌ర్ల‌కు కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ హామీ ఇచ్చారు.  డిపాజిట‌ర్ల డ‌బ్బు సుర‌క్షితంగా ఉన్న‌ట్లు ఆమె చెప్పారు.  డిపాజిట‌ర్లు, బ్యాంకు ప్ర‌యోజ‌నాల నేప‌థ్యంలో ఆర్బీఐ ఓ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు.  యెస్ బ్యాంకు సంక్షోభాన్ని త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ త‌న‌కు హామి ఇచ్చిన‌ట్లు ఆమె చెప్పారు. ఆర్బీఐతో పాటు ప్ర‌భుత్వం కూడా యెస్ బ్యాంకు కోలుకోవాల‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. నెల‌కు కేవ‌లం 50 వేలు మాత్ర‌మే విత్‌డ్రా చేసుకోవాల‌ని యెస్ బ్యాంకు డిపాజిట‌ర్లకు ఆర్బీఐ ఆంక్ష‌లు పెట్టిన విష‌యం తెలిసందే.   


logo