గురువారం 21 జనవరి 2021
National - Jan 03, 2021 , 20:49:11

మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహ్మద్ రఫిక్‌

మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహ్మద్ రఫిక్‌

భోపాల్ : మధ్యప్రదేశ్‌ హైకోర్టు 26వ ప్రధాన న్యాయమూర్తిగా మహ్మద్‌ రఫిక్‌ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఇన్‌చార్జి గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. మహ్మద్‌ రఫిక్‌ గతంలో ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. గతేడాది 31న ఆయన మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. మహ్మద్‌ రఫిక్‌ 1960 , మే 20న రాజస్థాన్‌లోని చురూ జిల్లా సుజాన్‌ఘర్‌లో జన్మించారు. రాజస్థాన్‌ హైకోర్టు న్యాయమూర్తి కాకముందు ఆయన మే 15, 2006 వరకు ప్రాక్టీస్‌‌ లాయర్‌గా కొనసాగారు. నవంబర్‌ 30, 2019 వరకు మధ్యప్రదేశ్‌ హైకోర్టులో 3,81,641 పెండింగ్‌ కేసులున్నాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo