శనివారం 30 మే 2020
National - Mar 31, 2020 , 18:56:32

దాచుకున్న‌ రూ.25 వేలు విరాళంగా ఇచ్చిన ప్ర‌ధాని త‌ల్లి హీరాబెన్‌

దాచుకున్న‌ రూ.25 వేలు విరాళంగా ఇచ్చిన ప్ర‌ధాని త‌ల్లి హీరాబెన్‌

న్యూఢిల్లీ: క‌రోనా మహ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌తోపాటు దేశ ప్ర‌జ‌ల‌ను కూడా ఉక్కిబిక్కిరి చేస్తున్న‌ది. దీంతో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. నిరుపేద‌లు తిండి లేక తిప్ప‌లు ప‌డాల్సిన దుస్థితి నెల‌కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ.. ప్రైమ్ మినిస్ట‌ర్స్ సిటిజ‌న్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమ‌ర్జెన్సీ సిచ్యుయేష‌న్స్ (PM-CARES) పేరుతో ఒక నిధిని ప్ర‌క‌టించారు. 

ఈ నిధికి ప‌లువురు రాజ‌కీయ నేత‌లు, వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామిక‌వేత్తలు, సినిమాస్టార్లు పెద్ద ఎత్తున విరాళాలు ప్ర‌క‌టిస్తున్నారు. వారితోపాటు కొంద‌రు సామాన్యులు కూడా త‌మ‌కు తోచినంత‌లో విరాళాలు ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని మాతృమూర్తి హీరాబెన్ కూడా పీఎం కేర్స్‌కు త‌న‌వంతు సాయం అందించారు. తాను ఎన్నో ఏండ్లుగా పొదుపు చేసుకుంటున్న సొమ్ములో నుంచి రూ.25,000ల‌ను పీఎం కేర్స్ విరాళంగా ఇచ్చారు. logo