శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 23:56:45

రేపు మణిపుర్ నీటి సరఫరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న మోడీ

 రేపు మణిపుర్ నీటి సరఫరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న మోడీ

ఢిల్లీ :ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపుర్ నీటి సరఫరా పరియోజన కు రేపు  వీడియో కాన్ఫరెన్స్  ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. మణిపుర్ గవర్నరు, ముఖ్యమంత్రి , ఆయనఇతర మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యే లు పాల్గొననున్నారు. ఇంపాల్ నుంచి జరిగే ఈ కార్యక్రమం లో వీరంతా ఆన్ లైన్ ద్వారా పాల్గొంటారు. 2024 వ సంవత్సరానికల్లా దేశం లోని ప్రతి గ్రామీణ కుటుంబానికి నాణ్యమైన, సురక్షితమైన త్రాగునీటి ని తగినంత గా సమకూర్చడం కోసం ‘‘ఇంటింటికీ జలం’’ అనే నినాదంతో జల్ జీవన్ మిషన్ ను భారత ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమం లో భాగం గా జల వనరుల స్థాయి ని పరిరక్షించే చర్యల ను అమలుపరచడం జరుగుతుంది.   logo