మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Sep 11, 2020 , 17:11:27

బిహార్‌లో రూ.16వేల కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోదీ

బిహార్‌లో రూ.16వేల కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోదీ

న్యూ ఢిల్లీ :  బిహార్‌లో రాబోయే 10 రోజుల్లో రూ.16,000 కోట్లతో ప‌లు అభివృద్ధి పనులను ప్రధాని ప్ర‌ధాని మోదీ ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిసింది. ప‌లు బహుళ ప్రాజెక్టుల‌తో పాటు మౌలిక సదుపాయాల క‌ల్ప‌న కోసం ఈ మొత్తాన్ని కేటాయించిన‌ట్లు స‌మాచారం. 

ఎల్‌పీజీ పైప్‌లైన్, బాట్లింగ్ ప్లాంట్, నమామి గంగే కింద మురుగునీటి శుద్ధి కర్మాగారం, నీటి సరఫరా పథకాలు, రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్, కొత్త రైల్వే లైన్, రైల్వే వంతెన, వివిధ విభాగాల విద్యుదీకరణ, హైవేల నిర్మాణం వంటి పలు రంగాలకు సంబంధించిన అభివృద్ధి ప‌నుల‌ను చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిసింది.  

అయితే అక్టోబ‌ర్‌- న‌వంబ‌ర్ నెల‌ల్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగనుండ‌గా ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ఇంత భారీ మొత్తంలో అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.