బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 10:25:53

క‌రోనా వేళ ప్ర‌భుత్వాల‌ను కూల్చుతున్న మోదీ స‌ర్కార్‌..

క‌రోనా వేళ ప్ర‌భుత్వాల‌ను కూల్చుతున్న మోదీ స‌ర్కార్‌..

హైద‌రాబాద్‌: బీజేపీ స‌ర్కార్‌పై రాహుల్ గాంధీ మ‌ళ్లీ ఫైర్ అయ్యారు. దేశంలో క‌రోనా వైర‌స్ సంక్షోభం నెల‌కొన్న స‌మ‌యంలో.. మోదీ ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కూల్చుతున్న‌ట్లు ఆరోపించారు.  రాజ‌స్థాన్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు మోదీ స‌ర్కార్ కుట్ర ప‌న్నిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు.  ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో రాహుల్ ఈ ఆరోప‌ణ‌లు చేశారు. ఫిబ్ర‌వ‌రిలో న‌మ‌స్తే ట్రంప్ ఈవెంట్‌ను ఆర్గ‌నైజ్ చేశార‌ని, మార్చిలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని కూల్చార‌ని, ఏప్రిల్‌లో కొవ్వొత్తుల‌‌ను వెలిగించార‌ని, మే నెల‌లో మోదీ స‌ర్కార్‌కు ఆరేళ్లు నిండాయ‌ని, జూన్‌లో బీహార్‌లో వ‌ర్చువ‌ల్ ర్యాలీ నిర్వ‌హించార‌ని, జూలైలో రాజ‌స్థాన్ స‌ర్కార్‌ను కూల్చేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని మోదీ స‌ర్కార్‌పై రాహుల్ పైర్ అయ్యారు. అందుకే దేశం అంతా క‌రోనా పోరులో ఆత్మ‌నిర్భ‌రంతో ఉంద‌న్నారు.logo