సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 19:50:06

తెలుగు రాష్ర్టాల సీఎంలకు ప్రధాని మోడీ ఫోన్‌

తెలుగు రాష్ర్టాల సీఎంలకు ప్రధాని మోడీ ఫోన్‌

హైదరాబాద్‌ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్‌, వైఎస్‌జగన్మోహన్‌రెడ్డిలకు ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆయా రాష్ర్టాల్లో కరోనా పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. కరోనా తీవ్రత, కొత్త కేసుల నమోదు, మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి? రోజుకు ఎంతమంది కరోనాతో మృత్యువాత పడుతున్నారు.. మరణశాతం ఎంత? తదితర వివరాలను అడిగినట్లు తెలిసింది. అంతేకాకుండా కరోనాను కట్టడి చేసేందుకు ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు చేపడుతున్న మార్గదర్శకాల గురించి అడిగి తెలుకున్నట్లు సమాచారం. అదే విధంగా ప్రధాని మోడీ కూడా సీఎంలకు కరోనా నివారణ, తదితర అంశాలపై పలు సూచనలు, సలహాలు చేసినట్లు తెలిసింది.  వీరితో పాటు మరో 7 రాష్ర్టాల సీఎంలతో కూడా ప్రధాని ఫోన్‌లో మాట్లాడి కరోనా తీవ్రత గురించి తెలుసుకున్నట్లు సమాచారం. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo