బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 09:59:21

అయోధ్యకు బయలుదేరిన మోడీ

అయోధ్యకు బయలుదేరిన మోడీ

న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిరం భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ఢిల్లీ నుంచి అయోధ్యకు బయలుదేరారు. ఈ మేరకు పీఎంఓ ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. భారతవాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ప్రధాని లక్నోకు వెళ్తారు. 10.40కి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో బ‌య‌లుదేరి 11.30కి అయోధ్యకు చేరుకుంటారు. 11:40కి హ‌నుమాన్‌ గర్హి ఆలయంలో పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రామజన్మభూమి ప్రాంతానికి ప్రధాని చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:30 నుంచి 12:40 వరకు భూమిపూజ జరుగనుంది. మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. 2:15 గంటలకు ప్రధాని తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
logo