అభిమానులు ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ మ్యాన్ 2 మొత్తానికి వచ్చేసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో దీనిని రిలీజ్ చేసింది. చడీచప్పుడు లేకుండా వచ్చిన తొలి సీజన్ హిట్ టాక్ కొట్టేయడంతో రెండో సీజన్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగినట్లే సీజన్ 2 ఉన్నట్లుగా పాజిటివ్ రీవ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ బ్యూటీ సమంత అదరగొట్టింది. ఆమెకుతోడు బాలీవుడ్ ఫేమ్, విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయీ, ప్రియమణి లీడ్ రోల్స్‌లో ఉన్న సీజన్ 2ను కూడా మన తెలుగు వాళ్లయిన రాజ్, డీకే జోడీ తెరకెక్కించింది.
సీజన్ 2లో యాక్షన్ చెన్నైకి షిప్ట్ అయింది. శ్రీలంక తమిళ రెబల్స్‌తో ఈసారి మనోజ్ బాజ్‌పాయీ ఫైట్ చేశాడు. ఈ రెబల్ గ్రూప్‌ను లీడ్ చేసింది ఎవరో కాదు.. సమంత అక్కినేని. ట్రైలర్‌తోనే సీజన్ 2 ఎంతో ఆసక్తి రేపింది. ఇప్పుడు అసలు షో మరింత అదరగొట్టింది. ఈ ఎమోషనల్ డ్రామాను రాజ్, డీకే జోడీ అద్భుతంగా చిత్రీకరించింది. దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ, మానసిక ఆరోగ్యం, భాషా భేదాలను ఈ సీజన్ హైలైట్ చేసింది. మనోజ్ బాజ్‌పేయితో పోటీ పడి నటించింది సమంత. ఈ పర్ఫార్మెన్స్ ఆమెకు హిందీ తెరపైనా అభిమానులను సంపాదించపెట్టనుంది. ఫ్యామిలీ మ్యాన్ రెండో సీజన్లో మొత్తం 9 ఎపిసోడ్లు ఉన్నాయి.