ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Sep 01, 2020 , 16:01:40

మోడీ ఇడ్లీలు.. రూ. 10కి నాలుగు! పోస్ట‌ర్లు రెడీ!

మోడీ ఇడ్లీలు.. రూ. 10కి నాలుగు! పోస్ట‌ర్లు రెడీ!

ఇప్పుడు ఎక్క‌డ చూసినా రెండు ఇడ్లీల‌కు రూ. 10 తీసుకుంటున్నారు. కానీ మోడీ ఇడ్లీలు మాత్రం రూ. 10కి నాలుగు ఇస్తార‌ట‌. ఈ ఇడ్లీలు మ‌రికొన్ని రోజుల్లో ప్ర‌జ‌ల‌ అందుబాటులోకి తీకొస్తున్న‌ట్లు పోస్ట‌ర్లు కూడా రెడీ చేసేశారు. ఇంత‌కీ ఇదంతా ఎవ‌రు చేస్తున్నారు? ఎక్క‌డ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఈ ప‌థ‌కాన్ని ప్రారంభిస్తున్న‌ది త‌మిళ‌నాడులోనే. ఆ రాష్ట్ర బీజేపీ ప్ర‌చార విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేష్ ఐడియానే ఇదంతా. ఈ విష‌యంపూ భారీగానే ప్ర‌చారం చేస్తున్నారు. పోస్ట‌ర్లు, కూప‌న్ల ద్వారా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తున్నారు.

ఈ ఆఫ‌ర్‌ను ముందుగా 22 దుకాణాల ద్వారా అందుబాటులోకి తీసుకు రావాల‌నుకుంటున్నారు. ఇది గ‌నుక స‌క్సెస్ అయితే మిగ‌తా ఏర్పాటు చేస్తామంటున్నారు మ‌హేష్‌. అస‌లు ఈ పోస్ట‌ర్ డిజైనింగ్ ఎవ‌రు చేశారో గాని భ‌లే ఆక‌ర్ష‌ణీయంగా చేశారు. ఒక‌వైపు మోడీ, మ‌రోవైపు మ‌హేష్ ఫోటోలో వేసి మ‌ధ్య‌లో త‌మిలంలో ఆఫ‌ర్ గురించి రాశారు. ఇలాంటి ఆఫ‌ర్లు రాజ‌కీయ నాయ‌కులు ఓట్లు కేస‌మే అని ప్ర‌జ‌ల‌కు కూడా తెలుసు. మ‌రి ఈ మోడీ ఇడ్లీలను ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డ‌తారో లేదో వేచి చూడాలి. 


logo