శుక్రవారం 05 మార్చి 2021
National - Jan 19, 2021 , 03:25:05

డీఏ 4 శాతం పెంపు?

డీఏ 4 శాతం పెంపు?

  • వాయిదా వేసిన నిర్ణయం అమలుకు కేంద్రం యోచన
  • తాజా నిర్ణయంతో 21% డీఏ.. ఈ నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం
  • అరకోటి మంది ఉద్యోగులకు.. 61 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పింఛనుదారులకు త్వరలో శుభవార్త చెప్పబోతున్నది. కరోనా నేపథ్యంలో నిలిపివేసిన ఉద్యోగుల కరువు భత్యం (డీఏ), పింఛనుదారుల కరువు ఉపశమనం (డీఆర్‌)ను త్వరలో పెంచబోతున్నది. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేట్లకు అనుగుణంగా డీఏ, డీఆర్‌ను 4 శాతం వరకు పెంచబోతున్నట్టు తెలుస్తున్నది. నివేదికల ప్రకారం.. ఈ నెలలోనే ఈ పెంపు నిర్ణయం అమల్లోకి రాబోతున్నట్టు సమాచారం. తాజా నిర్ణయంతో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 61 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనున్నది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 17 శాతంగా ఉన్నది. తాజా నిర్ణయంతో ఇది  21 శాతానికి పెరుగనున్నది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫారసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పెంపు నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగులకు డీఏను ప్రభుత్వం ఏడాదికి రెండు విడుతల్లో చెల్లిస్తున్నది. డీఏను 4 శాతం పెంచాలని గతంలోనే కేంద్రం నిర్ణయించింది. దీనికి గత మార్చిలో క్యాబినెట్‌ కూడా ఆమోదముద్ర వేసింది. అయితే కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ఈ నేపథ్యంలో డీఏ పెంపు నిర్ణయాన్ని కేంద్రం తాత్కాలికంగా పక్కనబెట్టింది. 

VIDEOS

logo