సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 15:19:06

మోదీ ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు

 మోదీ ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ లాక్‌డౌన్ నేప‌థ్యంలో పేద‌ల కోసం ల‌క్షా 70 వేల కోట్ల రిలీఫ్ ప్యాకేజీని కేంద్ర ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ ప్యాకేజీ ప‌ట్ల ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇది ప్ర‌భుత్వ ఉదార‌త‌ను చూపిస్తుంద‌న్నారు.  ఈ ప్యాకేజీ ఓ మైలురాయి వంటిద‌ని, దేశం నిర్వీర్య‌మైన ఈ త‌రుణంలో ఇది ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైంద‌ని బాబు అన్నారు. ఇటువంటి కష్ట స‌మ‌యాల్లో దేశం త్వ‌ర‌గా కోలుకుంటుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చంద్ర‌బాబు త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. మోదీ ప్ర‌భుత్వం మాన‌వ‌త్వంతో నిండిపోయింద‌ని బాబు అన్నారు.  మోదీకి లేఖ రాసిన బాబు.. ఆ లేఖ‌లో జ‌న‌తా క‌ర్ఫ్యూ విష‌యాన్ని మెచ్చుకున్నారు.  మీ నేతృత్వంలో కోవిడ్‌ను జ‌యించి, ఈ దేశం మ‌రింత బ‌లంగా మారుతుంద‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  డాక్ట‌ర్లు, హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు 50 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ క‌ల్పించ‌డం వారి సేవ‌కు త‌గిన ప్ర‌తిఫ‌ల‌మ‌న్నారు. రైతుల‌కు, మ‌హిళ‌ల‌కు, పేద‌ల‌కు ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించిన కేంద్రంపై నాయుడు ప్ర‌శంస‌లు కురిపించారు.


logo