శుక్రవారం 03 జూలై 2020
National - Jun 14, 2020 , 20:34:58

నిస్సహాయ స్థితిలో ముందుకు నడిపించిన ప్రధాని : నడ్డా

నిస్సహాయ స్థితిలో ముందుకు నడిపించిన ప్రధాని : నడ్డా

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ డైనమిక్‌ లీడర్‌ అని, కరోనా వైరస్‌ ప్రభావంతో కీలకమైన శక్తులు నిస్సహాయంగా ఉన్న స్థితిలో ప్రధాని మోదీ ముందుండి దేశాన్నిముందుకు నడిపించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. లాక్‌డౌన్‌ అన్న సమయానుకూల నిర్ణయాన్ని ధైర్యంతో తీసుకున్నారని కొనియాడారు. 'కర్నాటక జన సంవాద్ ర్యాలీ' ఉద్దేశించి నడ్డా ప్రసంగించారు. గత ఆరేళ్లలో ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం పురోభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలుగా అభివృద్ధిలో ఉన్న అంతరాన్ని మోదీ ఆరేళ్లలో పూడ్చివేశారని కేంద్రమంత్రి తెలిపారు. 'అన్నార్తులకు ఆహారం' అన్న పథకం కింద దేశ వ్యాప్తంగా 19 కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని అందించామని, 5కోట్ల మందికి మోదీ రేషన్ కిట్స్‌ను బీజేపీ కార్యకర్తలు సరఫరా చేశారని వివరించారు.


logo