శుక్రవారం 22 జనవరి 2021
National - Nov 23, 2020 , 13:11:30

పోఖ్రాన్ న్యూక్లియ‌ర్ టెస్ట్‌ల‌ను వ్య‌తిరేకించిన మోదీ, అమిత్ షా!

పోఖ్రాన్ న్యూక్లియ‌ర్ టెస్ట్‌ల‌ను వ్య‌తిరేకించిన మోదీ, అమిత్ షా!

న్యూఢిల్లీ: 1998లో రాజ‌స్థాన్‌లోని పోఖ్రాన్‌లో ఇండియా జ‌రిపిన అణు ప‌రీక్ష‌ల‌ను దేశమంతా స్వాగ‌తించింది. ఆ ప‌రీక్ష‌లు ఇండియాను అణ్వాయుధ దేశాల స‌ర‌స‌న నిల‌బెట్టింది. అయితే ప్ర‌స్తుతం దేశ ప్ర‌ధానిగా ఉన్న న‌రేంద్ర మోదీ, హోంమంత్రిగా ఉన్న అమిత్ షా మాత్రం ఈ ప‌రీక్ష‌ల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించార‌ట‌. పొలిటిక‌ల్ సైంటిస్ట్ విన‌య్ సీతాప‌తి రాసిన జుగ‌ల్బందీ: ద బీజేపీ బిఫోర్ మోదీ అనే పుస్త‌కం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ముఖ్యంగా అప్ప‌ట్లో గుజ‌రాత్‌లో ఓ సాధార‌ణ ఎమ్మెల్యేగా ఉన్న 33 ఏళ్ల అమిత్ షా అయితే అప్ప‌టి ప్ర‌ధాని వాజ్‌పేయి నిర్ణ‌యంపై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేసిన‌ట్లు ఈ పుస్త‌కంలో విన‌య్ సీతాప‌తి వెల్ల‌డించారు. ఈ ప‌రీక్ష‌ల‌పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసిన అమిత్ షా.. వాజ్‌పేయికి లేఖ రాసిన‌ట్లు చెప్పారు. గౌర‌వ‌నీయులైన వాజ్‌పేయిజీ, ప‌బ్లిసిటీ కోసం మీరు చేసిన ఈ ప‌ని పాక్ ఆక్ర‌మిత్ క‌శ్మీర్‌ను ఎప్ప‌టికీ కోల్పోయేలా చేసింది అని ఆ లేఖ‌లో అమిత్ షా అభిప్రాయ‌ప‌డిన‌ట్లు తెలిపారు. ఆ వెంట‌నే అమిత్ షాను వాజ్‌పేయి ఢిల్లీ పిలిపించి ఈ లేఖ‌పై మాట్లాడిన‌ట్లు కూడా పుస్త‌కంలో రాశారు విన‌య్ సీతాప‌తి. అటు ఈ ప‌రీక్ష‌లను మోదీ కూడా వ్య‌తిరేకించిన‌ట్లు వెల్ల‌డించారు. 


logo