మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 11:32:06

యమునా నది శుద్ధికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

యమునా నది శుద్ధికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

న్యూఢిల్లీ : హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వస్తున్న 150 మిలియన్‌ గ్యాలన్ల కలుషిత నీటిని సహజ చిత్తడి నేలలు, వాయు పద్ధతి ద్వారా శుద్ధి చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ సీఎం  జల్‌ బోర్డు అధికారులతో 2023 మార్చి నాటికి యమునా నది కాలుష్యాన్ని 90శాతం తగ్గించేందుకు ప్రణాళిక వేగంగా అమలు చేయడంపై చర్చించారు. జల్‌ బోర్డు కేబినెట్‌ మంత్రి సత్యేంద్రజైన్‌, డీజేబీ సీఈఓ నిఖిల్‌ కుమార్ ఇతర అధికారులు హాజరైన సమావేశలో 90 ఎంజీడీ నీటి సామర్థ్యానికి వ్యతిరేకంగా, 400 ఎంజీడీల పునర్వినియోగంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సమర్పించారు.

ఎస్టీపీల్లోని అన్ని పరికరాలను అప్‌గ్రేడ్ చేయడం సహా ప్రస్తుత ఎస్‌టీపీల నాణ్యతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోనున్నారు. యమునా నది శుద్ధికి నాలుగు విడుతల ప్రణాళిక రూపొందించారు. మొదట హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వస్తున్న 150 ఎంజీడీల కలుషిత నీటిని శుద్ధి చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు పేర్కొన్నారు. తర్వాత చిన్న, పెద్ద కాలువల్లోని మురుగునీటిని శుద్ధి ప్లాంట్లలో (ఎస్‌టీపీ) ట్యాప్‌ చేస్తామని, మూడోదిగా అన్ని పరికరాలు అప్‌గ్రేడ్‌ చేయడం, నాలుగో దశలో ఢిల్లీ అంతటా సెప్టిక్‌ ట్యాంకుల నుంచి వచ్చే బురద, సెప్టేజ్‌ సేకరించి జల్‌ బోర్డ్‌ బయో గ్యాస్‌ ప్లాంట్లలో విద్యుత్‌, వాయువు ఉత్పత్తి చేయడానికి ఉపయోగించాలని నిర్ణయించారు. మార్చి 2023 నాటికి యమునా నదిలో 90శాతం కాలుష్యాన్ని తగ్గించే చర్య ప్రణాళికను డీజేబీ సమర్పించింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.