బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 08:28:17

నేపాల్ లో భూకంపం..

నేపాల్ లో భూకంపం..

ఖాట్మండ్‌: నేపాల్ లో స్వ‌ల్ప భూకంపం సంభ‌వించింది. డోల‌ఖా జిల్లాలో రాత్రి 11: 53 గంట‌ల స‌మ‌యంలో భూప్ర‌కంప‌న‌లు న‌మోద‌య్యాయి. రిక్ట‌ర్ స్కేలుపై 5.3 తీవ్ర‌త ‌తో ప్ర‌కంప‌న‌లు న‌మోదైన‌ట్లు నేపాల్ లోని నేష‌న‌ల్  సిస్మోలాజికల్ సెంట‌ర్ వెల్ల‌డించింది. హిమాల‌య‌న్ స‌రిహ‌ద్దు దేశ‌మైన నేపాల్ ను త‌ర‌చూ భూకంపాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయ‌నే విష‌యం తెలిసిందే.

మ‌రోవైపు ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలోని సాంటా క్రూజ్ ఐలాండ్స్ లో మంగ‌ళ‌వానం 6.5 తీవ్ర‌త‌తో భూకంపం న‌మోదైందని  స్థానిక భూకంప అధ్య‌య‌న కేంద్రం వెల్ల‌డించింది. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo