బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 12:36:55

క్వారంటైన్ లో ఉన్న వారి ప‌ర్య‌వేక్ష‌ణ‌కు యాప్

క్వారంటైన్ లో ఉన్న వారి ప‌ర్య‌వేక్ష‌ణ‌కు యాప్

డెహ్రాడూన్‌:హోంక్వారంటైన్ లో ఉన్నవారిని ప‌ర్యవేక్షించేందుకు డెహ్రాడూన్ జిల్లా యంత్రం మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇత‌ర రాష్ట్రాల నుంచి వచ్చి హోంక్వారంటైన్ లో ఉన్న‌వ‌ల‌స కార్మికులను క‌ద‌లికల‌పై దృష్టి పెట్టేందుకు జీపీఎస్ ఆధారిత IGiS-Geo Locator యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చి క్వారంటైన్ ఉన్న కార్మికులు విధిగా త‌మ స్మార్ట్‌ఫోన్ల‌ను ఈ యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకోవాల‌ని అధికారులు సూచించారు.

క్వారంటైన్ లో ఉన్న వారి ఆరోగ్య ప‌రిస్థితి ఎప్పుటిక‌పుడు స‌మీక్షించేందుకు యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని డెహ్రాడూన్ జిల్లా మేజిస్ట్రేట్ అశుతోష్  శ్రీవాస్త‌వ తెలిపారు. క్వారంటైన్ లో ఉన్న‌వారు ఫోన్ కు 50 మీట‌ర్ల ప‌రిధిలో లేకున్నా..30 నిమిషాలపాటు ఫోన్ లో స‌ద‌రు వ్య‌క్తికి సంబంధించి ఎలాంటి క‌ద‌లిక‌లు న‌మోదు కాకున్నా స్మార్ట్ ఫోన్ కు సందేశం వ‌స్తుంద‌న్నారు. 


logo