గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 28, 2020 , 15:20:36

స్కూల్‌కు నిప్పు పెట్టి దాడులకు దిగారు..

స్కూల్‌కు నిప్పు పెట్టి దాడులకు దిగారు..

న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని శివ్‌ విహార్‌లోని ఓ పాఠశాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. స్కూల్‌ ఫర్నిచర్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటన ఫిబ్రవరి 24న చోటు చేసుకుంది. ఇప్పుడిప్పుడే ఈశాన్య ఢిల్లీలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. శివ్‌ విహార్‌లోని రాజధాని పబ్లిక్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో బోర్డు ఎగ్జామ్స్‌ ఇటీవలే ప్రారంభమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం పరీక్షలు ముగిశాక విద్యార్థులంతా తమ నివాసాలకు వెళ్లిపోయారు. అక్కడ కేవలం పాఠశాల సెక్యూరిటీ గార్డు, డ్రైవర్‌ మాత్రమే ఉన్నారు. అల్లరి మూకలు పక్కనున్న భవనంపై నుంచి తాళ్ల సహాయంతో స్కూల్‌లోకి ప్రవేశించారు. స్కూల్‌లోకి రాగానే తలుపులను విరగొట్టారు. కుర్చీలు, నల్ల బల్లలను ధ్వంసం చేశారు. లైబ్రరీలో ఉన్న పుస్తకాలతో పాటు మిగతా వస్తువులను, టేబుల్స్‌ను ఒక చోటకు చేర్చి నిప్పు పెట్టారు. ఆ తర్వాత దాడులకు దిగారు.

25 ఏండ్ల నుంచి నడుస్తున్న ఈ పాఠశాలను కేవలం 24 గంటల్లో బుగ్గిపాలు చేశారు ఆందోళనకారులు. సెక్యూరిటీ గార్డు మనోజ్‌, డ్రైవర్‌ రాజ్‌కుమార్‌ కుటుంబాలను ఒక గదిలో వేసి నిర్బంధించారు. వీరు 60 గంటల పాటు నరకయాతన అనుభవించారు. ఎట్టకేలకు పోలీసులు, స్కూల్‌ యాజమాన్యం సహాయంతో వారు గది నుంచి బయటకు రాగలిగారు. అయితే ఘటన జరిగిన సమయంలో అక్కడికి పోలీసులు రాకపోవడంతో పాఠశాల యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా, అనుకూలంగా చెలరేగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య 42కి చేరింది. సుమారు 300 మంది తీవ్రంగా గాయపడ్డారు.logo
>>>>>>