గురువారం 16 జూలై 2020
National - Jun 22, 2020 , 18:11:50

చైనాకు వ్యతిరేకంగా ‘ఎంఎన్‌ఎస్‌' కార్యకర్తల నిరసన

చైనాకు వ్యతిరేకంగా ‘ఎంఎన్‌ఎస్‌' కార్యకర్తల నిరసన

ముంబై : ఇటీవల గాల్వాన్‌ లోయలో చైనా దళాలు-భారత జవాన్లకు నడుమ జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే.  దీంతో చైనా తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నారు. మహారాష్ట్రలోని ఘట్కోపర్‌ ప్రాంతంలో మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన కార్యకర్తలు చైనా తీరుకు నిరసనగా సోమవారం ఆందోళన నిర్వహించారు. చైనా వస్తువులు బహిష్కరించాలని పోస్టర్లు ప్రదర్శిస్తూ ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ పోస్టర్‌ను కిందపడేసి తొక్కారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డ్రాగన్‌కు గట్టి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చైనా వస్తువులు కొనకుండా ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతియాలన్నారు.


logo