గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 21:17:49

మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శ్రీ‌నివాస‌రెడ్డి

మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శ్రీ‌నివాస‌రెడ్డి

వరంగల్‌ : మంత్రి కేటీఆర్‌ జ‌న్మ‌దినం సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్సీ శ్రీ‌నివాస‌రెడ్డి రామప్ప శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగ‌ణంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్‌ యువతకు స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. ప్ర‌జా జీవితం సుదీర్ఘంగా సేవలందించి బంగారు తెలంగాణ‌కు బాట‌లు వేయాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా పాలంపేటను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. రూ.70 లక్షల నిధులతో గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు.

రామప్ప ఆలయాన్నిఅంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆలయ తూర్పు ద్వారం స్వాగత తోరణం పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ‌నివాస‌రెడ్డితోపాటు, ములుగు జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్వర్,  రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్‌ రావు, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా: కె వాసుదేవ రెడ్డి, లింగాల ఘనపురం జడ్పీటీసీ గుడి వంశీధ‌ర్ రెడ్డి, టీఆర్‌ఎస్‌ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సతీ‌శ్రెడ్డి, పాలంపేట సర్పంచ్ అశోక్, టీఆర్ఎస్‌ రాష్ట్ర నాయకుడు కేశవరావు తదితరులు పాల్గొన్నారు.


logo