బెంగుళూరు: కర్నాటక ఎమ్మెల్యే రమేశ్ జార్కోలీ రాసలీల వీడియో ఇటీవల ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే మాజీ మంత్రి రమేశ్‌తో ఓ ఫోటోలో ఉన్న మహిళ ఇప్పుడు ఆ రాష్ట్ర చీఫ్ జస్టిస్‌ను ఆశ్రయించింది. తనకు రక్షణ కల్పించాలంటూ ఆమె చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసింది. లైంగిక వాంఛలు తీరిస్తే ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాజీ మంత్రి సాగించిన రాసలీలలు కర్నాటకలో దుమారం రేపాయి. అయితే ఈ కేసులో రేప్ బాధితురాలైన మహిళ తాజాగా ప్రధాన న్యాయమూర్తి లేఖ రాసింది. ఎమ్మెల్యే రమేశ్ చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి అని, ఇప్పటికే తనకు పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చారని, తనపై ఆయన ఎటువంటి సాహసానికైనా సిద్దపడుతాడని, అందుకే తనకు రక్షణ కల్పించాలని ఆ మహిళ చీఫ్ జస్టిస్‌ను కోరింది. తనకు, తన పేరెంట్స్‌కు సిట్ ఎటువంటి రక్షణ కల్పించడం లేదని ఆమె ఆరోపించింది. ఏ క్షణమైనా, ఎక్కడైనా ఎమ్మెల్యే రమేశ్ తనను హతమారుస్తాడని ఆమె పేర్కొన్నది.