చెన్నై : డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ఎమ్మెల్యేగా ఆ రాష్ర్ట అసెంబ్లీలో ప్రమాణం చేశారు. తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ఇవాళ ప్రమాణం చేశారు. గత శుక్రవారం తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 33 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా అదే రోజు ప్రమాణం చేశారు. వీరిలో 19 మంది మాజీ మంత్రులు కాగా, 15 మంది కొత్తవారు. స్టాలిన్ కేబినెట్లో ఇద్దరు మహిళలకు చోటు లభించింది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో డీఎంకే 133 స్థానాల్లో విజయం సాధించి, అధికారాన్ని కైవసం చేసుకుంది.