శనివారం 28 నవంబర్ 2020
National - Oct 26, 2020 , 20:58:17

మిజోరం రాజధానిలో నవంబర్‌ 3 వరకు లాక్‌డౌన్‌

మిజోరం రాజధానిలో నవంబర్‌ 3 వరకు లాక్‌డౌన్‌

ఐజ్వల్‌: మిజోరం రాజధాని ఐజ్వల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. మంగళవారం ఉదయం 4.30 గంటల నుంచి నవంబర్‌ 3 ఉదయం 4.30 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల విభాగం అధికారులు తెలిపారు. మిజోరం హోంమంత్రి, ఆరోగ్య మంత్రి నేతృత్వంలో సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సీఎం జోరంతాంగ అంగీకారం అనంతరం రాజధాని ప్రాంతమైన ఐజ్వల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు. మంగళవారం ఉదయం 4.30 గంటలకు మొదలయ్యే ఈ లాక్‌డౌన్‌ నవంబర్‌ 3 ఉదయం 4.30 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపారు. అయితే ఈ లాక్‌డౌన్‌ ఎందుకు అమలు చేస్తున్నారన్నది స్పష్టం చేయలేదు. మిజోరంలో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నది. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 2,500గా ఉన్నది. కరోనా వల్ల ఎవరూ కూడా మరణించలేదు. మరోవైపు అసోంతో సరిహద్దు సమస్య కూడా ఒక కారణం కావచ్చని తెలుస్తున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.