ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 08:34:26

గర్భిణికి సీజేరియన్‌ చేసిన ఎమ్మెల్యే

గర్భిణికి సీజేరియన్‌ చేసిన ఎమ్మెల్యే

ఐజ్వాల్‌ : ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఎమ్మెల్యే పురుడు పోశారు. సమయానికి ఎమ్మెల్యే స్పందించడంతో.. బాధిత మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎమ్మెల్యే చొరవతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. మిజోరంలోని చాంఫై నార్త్‌ ఎమ్మెల్యే జడ్‌ఆర్‌ థైమ్సంగా సోమవారం తన నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల సంభవించిన భూంకపాలు, కరోనా వైరస్‌ తీవ్రతతో పాటు ఇతర అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలోనే నాగూర్‌ గ్రామంలో నెలలు నిండిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు ఎమ్మెల్యేకు సమాచారం అందింది. వృత్తిరీత్యా గైనకాలజీ డాక్టర్‌ అయిన థైమ్సంగా.. చాంఫై ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పురుడు పోశారు. గర్భిణికి ఎమ్మెల్యే సీజేరియన్‌ చేశారు. చాంఫై ఆస్పత్రి డాక్టర్‌ అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్నారు. 



logo