మంగళవారం 14 జూలై 2020
National - Jun 22, 2020 , 13:10:11

ప్ర‌ధానికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన మిజోరం సీఎం

ప్ర‌ధానికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన మిజోరం సీఎం

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి మిజోరం సీఎం జొరామ్‌తంగ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మిజోరం సోమ‌వారం తెల్ల‌వారుజామున 5.5 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌వించింది. ఈ భూకంపంవ‌ల్ల అదృష్ట‌వ‌శాత్తు ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌రుగ‌క‌పోయినా ఆస్తి న‌ష్టం వాటిల్లింది. దీంతో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ మిజోరం సీఎం జొరామ్‌తంగ‌కు ఫోన్‌చేసి మాట్లాడారు. భూకంపంవ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చుకోవ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం మిజోరం ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తుంద‌ని ప్ర‌ధాని హామీ ఇచ్చారు. 

ఈ నేప‌థ్యంలో మిజోరం సీఎం జొరామ్‌తంగ ప్ర‌ధాని మోదీకి ట్విట్ట‌ర్ ద్వారా కృత‌జ్ఞ‌తలు తెలిపారు. థాంక్యూ మోదీగారు. భూకంపంవ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. మీరిచ్చిన భ‌రోసాతో మిజోరం ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు అని మిజోరం సీఎం ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు. కాగా, మిజోరంలో ఐజ్వాల్ స‌మీపంలో ఆదివారం సాయంత్రం 4.16 గంట‌ల‌కు 5.1 తీవ్ర‌త‌తో, చంఫాయ్ ప్రాంతంలో సోమ‌వారం ఉద‌యం 4.10 గంట‌ల‌కు 5.5 తీవ్రతతో వ‌రుస భూకంపాలు సంభ‌వించాయి.             


logo