గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 15:39:00

మీరాబాయి చానూ ప్రతిపాదనలకు మిషన్ ఒలింపిక్ కమిటీ ఆమోదం

 మీరాబాయి చానూ ప్రతిపాదనలకు మిషన్ ఒలింపిక్ కమిటీ ఆమోదం

ఢిల్లీ : ఒలింపిక్ క్రీడలకు వెళ్లే క్రీడాకారులకు ఆరు క్రీడాంశాల్లో ఇవ్వవలసిన శిక్షణకు సంబంధించి కోటిన్నర రూపాయల ప్రతిపాదనలపై మిషన్ ఒలింపిక్స్ పేరిట ఆన్ లైన్ ద్వారా సమావేశం నిర్వహించారు. షూటింగ్, బాడ్మింటన్, బాక్సింగ్, వికలాంగుల క్రీడలు, వెయిట్ లిఫ్టింగ్, హాకీలో టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకంలో భాగస్వాములైన క్రీడాకారులకు శిక్షణ వంటి అంశాలు ఇందులో చర్చించారు. వారికి 2 నెలల విదేశీ శిక్షణ కోసం ప్రముఖ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానూ చేసిన ప్రతిపాదనల మేరకు రూ. 40కోట్లు కమిటీ మంజూరు చేసింది.

అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో ఇవ్వనున్న ఈ శిక్షణా కార్యక్రమంలో ఆమెతో పాటు, ఆమె కోచ్, ఫిజియో థెరపిస్ట్ పాల్గొంటారు. ఆమెకు తగిలిన గాయానికిగాను దీర్ఖకాలం పునరావాసం కూడా కల్పిస్తారు. ఈ మేరకు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి కిరెణ్ రిజిజు మాట్లాడుతూ,..ఒలింపిక్ క్రీడలకు వెళ్లనున్న మన క్రీడాకారులకోసం అత్యుత్తమమైన సదుపాయాలు కల్పించే అంశంపైనే తాము పూర్తిగా దృష్టిని కేంద్రీకరించినట్టు చెప్పారు.

"అమెరికాలో ఈ శిక్షణతో పాటుగా, మీరాబాయికి ఉత్తమమైన పునరావాస సదుపాయం లభిస్తుందని కమిటీలోని నిపుణులు అభిప్రాయపడ్డారు. అందుకోసమే ఆమె కోచ్, ఫిజియో థెరపిస్టు కూడా ఆమెతోపాటు అమెరికా వెళ్తున్నారు. ఒలింపిక్ క్రీడలకోసం ఆమె సన్నాహాలకు ఇది చక్కని ప్రోత్సాహం అందిస్తుందని నేను కచ్చితంగా నమ్ముతున్నాను." అని మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo