శిక్షణ కోసం అమెరికాలో వెళ్లనున్నకుస్తీ వీరుడు భజరంగ్ పునియా

ఢిల్లీ: కుస్తీ వీరుడు భజరంగ్ పునియా కు అమెరికాలో నెల రోజులు శిక్షణ పొందేందుకు అనుమతి లభించింది . మిషన్ ఒలింపిక్ సెల్ 50వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 4వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు, మిచిగాన్‌లోని క్లిఫ్ కీన్ రెజ్లింగ్ క్లబ్లో ఈ శిక్షణ ఉంటుంది. ఇందుకు దాదాపు రూ.14 లక్షలు ఖర్చవుతుంది. ప్రస్తుతం సోనెపట్‌లోని సాయ్ శిక్షణ శిబిరంలో ఉన్న భజరంగ్ పునియా, తన కోచ్ ఎమ్జారియోస్ బెంటినిడిస్, ఫిజియో ధనంజయ్ లతో కలిసి అమెరికా వెళ్లనున్నారు. అక్కడ అంతర్జాతీయ స్థాయి మల్లయోధులతో కలిసి, ముఖ్య కోచ్ సెర్గీ బెలోగ్లాజోవ్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటారు. సెర్గీ బెలోగ్లాజోవ్ రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించారు. 2019 ప్రపంచ పోటీల్లో చోటు దక్కించుకోవడం ద్వారా, టోక్యో ఒలింపిక్స్‌కు భజరంగ్ ఇప్పటికే అర్హత సాధిం చిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.