గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 20:05:57

కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు:గ‌న్‌మ్యాన్‌ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు:గ‌న్‌మ్యాన్‌ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

తిరువ‌నంత‌పురం: కేర‌ళలో ప‌ట్టుబ‌డ్డ బంగారం అక్ర‌మ ర‌వాణా కేసు నిందితుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న గ‌న్‌మ్యాన్‌ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. తిరువ‌నంత‌పురంలోని యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాయ‌బార కార్యాల‌యం గ‌న్‌మ్యాన్‌‌గా విధులు నిర్వ‌హిస్తున్న జ‌య‌ఘోష్ గ‌త రెండు రోజులుగా క‌నిపించ‌కుండా పోయాడు. దీంతో గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు నిందితుల నుంచి బెదిరింపులు రావ‌డంతో అత‌డు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడ‌ని కుటుంబ‌స‌భ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసుల‌కు అత‌ని ఇంటి స‌మీపంలోని ఓ గోడ ప‌క్క‌న ర‌క్త‌పు మ‌డుగులో అప‌స్మార‌క స్థితిలో జ‌య‌ఘోష్ క‌నిపించాడు. 

దీంతో పోలీసులు అత‌డిని ఆస్ప‌త్రిలో చేర్పించి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. జ‌య‌ఘోష్ గోడ‌పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసి ఉంటాడ‌ని పోలలీసులు అనుమానిస్తున్నారు. తిరువ‌నంత‌పురంలోని యూఏఈ దౌత్య కార్యాల‌యం అధికారి పేరుతో దొంగ బంగారం వ‌స్తున్న విష‌యాన్ని జ‌య‌ఘోషే క‌స్ట‌మ్స్ అధికారుల‌కు చెప్పి ఉంటాడ‌న్న అనుమానంతో నిందుతుల త‌ర‌ఫు మ‌నుషులు అతడిని బెదిరిస్తున్నార‌ని అత‌ని కుటుంబ‌స‌భ్య‌లు చెబుతున్నారు.        ‌   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo