శనివారం 28 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 22:56:05

అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం.. సాంకేతిక సాయంతో గుర్తించిన పోలీసులు

అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం.. సాంకేతిక సాయంతో గుర్తించిన పోలీసులు

కరీంనగర్‌ :  అదృశ్యమైన యువతి ఆచూకీని సాంకేతిక సాయంతో పోలీసులు గుర్తించారు. యువతిని క్షేమంగా తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. వివరాలివి.. జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన యువతి (19) మంగళవారం కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఆచూకీ కోసం వెతికినా లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్పందించిన పోలీసులు సాంకేతికత ఆధారంగా యువతి కరీంనగర్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు నచ్చజెప్పి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతిక సాయంతో యువతి ఆచూకీ గుర్తించిన ఎస్‌ఐ సృజన్ రెడ్డి, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఆర్ఐ మురళి, వీణవంక ఎస్ఐ  కిరణ్‌ రెడ్డి లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి అభినందించి నగదు రివార్డు ప్రకటించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.