సోమవారం 06 జూలై 2020
National - Jun 16, 2020 , 17:02:23

3 రోజులుగా బీజేపీ నేత మిస్సింగ్‌..అడవిలో మృతదేహం

3 రోజులుగా బీజేపీ నేత మిస్సింగ్‌..అడవిలో మృతదేహం

సూరజ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌ జిల్లాలో 3 రోజులుగా కనిపించకుండా పోయిన బీజేపీ కిసాన్‌ మోర్చా నేత హత్యకు గురయ్యారు. సూరజ్‌పూర్‌ జిల్లాలోని రెడ్‌పహ్రీ పారెస్ట్‌లో శివచరణ్‌ కాశీ (60) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పాసల్‌ గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో రెండు ముక్కలుగా చేయబడ్డ శివచరణ్‌ కాశీ డెడ్‌బాడీని గుర్తించామని ఎస్పీ రాజేశ్‌ కుక్రేజా తెలిపారు.

భూవివాదానికి సంబంధించిన ఘటనలో  శివచరణ్ కాశీని హత్యచేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు.  ఈ ఘటనతో సంబంధమున్నట్లు భావించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బీహార్‌పూర్‌ బీజేపీ కిసాన్‌ మోర్చా మండలాధ్యక్షుడిగా ఉన్న శివచరణ్ కాశీ గత శనివారం నుంచి కనిపించకుండా పోయారు. అతన్ని పదునైన ఆయుధంతో దాడి చేసి చంపారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ రాజేశ్‌ కుక్రేజా వెల్లడించారు. 


logo