గురువారం 16 జూలై 2020
National - Jun 22, 2020 , 14:02:02

ఒక లెజెండ్‌ను కోల్పోయాం : విరాట్‌ కోహ్లీ

ఒక లెజెండ్‌ను కోల్పోయాం : విరాట్‌ కోహ్లీ

ఒక లెజెండ్‌ను కోల్పోయాం : విరాట్‌ కోహ్లీ

న్యూ ఢిల్లీ : మాజీ రంజీ ప్లేయర్‌ రాజిందర్‌ గోయల్‌ (77)అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. రాజిందర్‌ గోయల్‌ రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఆయన మృతికి క్రికెటర్లు, రంజీ ప్లేయర్లు సోషల్‌ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

‘మేము లెజెండ్‌ ఆటగాడు రాజిందర్‌ గోయల్‌జీను కోల్పోయాం. రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తి, అతడి మృతి కలచివేసింది. అతడి కుటుంబ సభ్యులకు, ప్రియమైనవారందకీ బలాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నా’ అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ట్వీట్‌ చేశారు. 

‘రాజిందర్‌ గోయల్‌జి కన్నుమూసిన విషయం విన్నందుకు బాధగా ఉంది. రంజీ ట్రోఫీలో 600కు పైగా వికెట్లు తీసిన స్పిన్నర్‌ రాజిందర్‌. అతని ఆత్మకు శాంతి చేకూరాలి. అతని కుటుంబ సభ్యులు, బంధువులకు  నా సంతాపం’ అని సచిన్‌ టెండూల్కర్‌ ట్వీట్‌ పోస్టు చేశారు.

‘రాజిందర్‌ గోయల్‌ కన్నుమూశారని తెలిసింది. ఇది చాలా బాధాకరం. భారతదేశపు అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరైన రాజిందర్‌ గోయల్‌.. రంజీ ట్రోఫీలో 750 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఇది క్రికెట్‌ చరిత్రలో గొప్ప రికార్డు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశాడు. 
logo