శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 15:10:32

ప్రాణం నిలిపాడు..!

ప్రాణం నిలిపాడు..!

ముంబై : పరుగు పెడుతున్న రైలు నుంచి దిగుతూ కాలుజారి పడిపోబోయిన ఓ వ్యక్తిని కాపాడారు రైల్వే సెక్యూరిటీ సిబ్బంది. మహారాష్ట్రలోని కళ్యాణ్‌ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్‌ అక్కడే ఓ సీసీటీవీలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే విధుల్లో కల్యాణ్‌ స్టేషన్‌లో మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్‌ విభాగానికి చెందిన కె సాహు అక్కడే విధుల్లో ఉన్నారు. అప్పుడే వస్తున్న రైలు నుంచి 52 ఏళ్ల సోమనాథ్‌ అనే అనే వ్యక్తి దిగబోయాడు. రైలు వేగంగా ఉండడంతో సదరు వ్యక్తి కింద కిందపడబోయాడు. అక్కడే ఉన్న సాహుతో పాటు మరో వ్యక్తి తక్షణమే స్పందించి సదరు వ్యక్తిని కిందపడకుండా కాపాడాడు. తక్షణం స్పందించకపోయి ఉంటే అదే రైలు కింద పడే ప్రమాదం ఉండేది. అయితే ప్రయాణికుడు వేగంగా వెళ్తున్న రైలు నుంచి నిర్లక్ష్యంగా దిగుతున్నట్లు వీడియోలో కనిపించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo