బుధవారం 03 జూన్ 2020
National - May 10, 2020 , 17:50:20

ప్రతీ అడుగులో నీవే అమ్మా

ప్రతీ అడుగులో నీవే అమ్మా

న్యూఢిల్లీ: నేను వేసే ప్రతి అడుగులో నీవే  ఉన్నావు, నా ప్రతి శ్వాసలో నీవే ఉన్నావు, నన్ను నడిపించే శక్తివి నీవే.. అంటూ ప్రపంచ అమ్మల దినోత్సవం సందర్భంగా తన దివంగత తల్లి సుష్మాస్వరాజ్‌ను ట్విట్టర్‌ ద్వారా గుర్తుకు తెచ్చుకొన్నారు ఆమె కూతురు భన్సూరీ స్వరాజ్‌. గత ఏడాది ఆగస్టులో సుష్మాస్వరాజ్‌ కన్నుమూశారు. ఎందరికో ప్రేమను పంచిన నీవు.. నాకు అమ్మవైనందుకు నా జీవితం ధన్యమైంది అంటూ తల్లికి ప్రణమిల్లారు. కేంద్ర విదేశాంగశాఖ మంత్రిగా 2014 మే 26 నుంచి 2019 మే  వరకు కొనసాగి తొలి మహిళా విదేశాంగ మంత్రిగా రికార్డులకెక్కారు.  25 ఏండ్ల వయసులో 1977లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికైన సుష్మాస్వరాజ్‌, అనంతరం రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 


logo