బుధవారం 03 జూన్ 2020
National - Apr 10, 2020 , 16:42:18

రైలు ప్రయాణాలపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు

రైలు ప్రయాణాలపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు

ఢిల్లీ : రైలు ప్రయాణాలపై గడిచిన రెండు రోజులుగా మీడియా, సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయియని అటువంటి ప్రచారాలను నమ్మొద్దని రైల్వే మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నెల 14వ తేదీన లాక్‌డౌన్‌ ముగుస్తుండటంతో 15వ తేదీ నుంచి రైలు ప్రయాణాలకు సంబంధించి రిజర్వేషన్లను రైల్వేశాఖ ప్రారంభించిందంటూ కొన్ని మీడియా సంస్థలు, సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారాలపై రైల్వేశాఖ స్పందించింది. రైలు ప్రయాణ ప్రారంభాలు, కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రయాణికులకు మార్గదర్శకాలు, రిజర్వేషన్ల ప్రారంభ తేదీలు అంటూ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అసత్యాలని పేర్కొంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇటువంటి వార్తలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తామన్నారు. ఏదైనా ప్రసారం చేసేప్పుడు సంబంధిత వర్గాల నుంచి అధికారికంగా తెలుసుకొని ప్రసారం చేయాలంది. రైలు ప్రయాణాలపై ఏ నిర్ణయం తీసుకున్నా తక్షణమే రైల్వేశాఖ తెలియజేయనున్నట్లు పేర్కొంది.


logo