శనివారం 11 జూలై 2020
National - Jun 27, 2020 , 14:29:44

ఏనుగు అల్ల‌రి చేష్ట‌లు.. నీటిలోకి ఎలా నెట్టిందో చూడండి!

ఏనుగు అల్ల‌రి చేష్ట‌లు.. నీటిలోకి ఎలా నెట్టిందో చూడండి!

చిన్నత‌నంలో ప్ర‌తిఒక్క‌రూ అల్ల‌రి ప‌నులు చేయ‌కుండా ఉండ‌రు. స్కూల్‌లో ఉన్న‌ప్పుడు క్లాస్‌కు లేట్ అయితే టీచ‌ర్ బ‌య‌టే నిల‌బ‌డ‌మ‌ని ప‌నిష్‌మెంట్ ఇస్తుంది. బ‌య‌ట ఒక‌రే ఉండ‌రు. ముగ్గురు, న‌లుగురితో కోతి బ్యాచ్ కూడా ఉంటుంది. ఒక‌డు క్లాస్‌లో ఉన్న ఫ్రెండ్స్‌‌ను చూసేందుకు డోర్ వ‌ద్ద నిల‌బ‌డి తొంగి తొంగి చూస్తుంటే.. వెనుక ఉన్నోడు ఊరుకుంటాడా! ముందున్నోడిని ముందుకు నెట్టేస్తాడు. దాంతో వాడు ప‌డ‌బోతున్న‌ట్లుగా క్లాస్ రూం లోప‌ల అడుగుపెట్టి టీచ‌ర్‌తో తిట్లు తింటాడు. ఇలాంటి కోతి ప‌నులు మ‌నుషులే కాదు జంతువులు కూడా చేసి ఎంజాయ్ చేస్తుంటాయి.

ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి సుశాంత నంద ట్విట‌ర్‌లో షేర్ చేసిన 13 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియో కూడా అలాంటిదే. రెండు ఏనుగులు కొల‌ను ద‌గ్గ‌ర ప‌‌క్క ప‌క్క‌నే ఉంటాయి. అల్ల‌రి ఏనుగు త‌న ఫ్రెండ్ ఏనుగు వెనుక‌కు వెళ్లి తొండంతో నీటిలోకి నెట్టేసింది. 'కొంటె ఆట‌లో ఏనుగు పిల్ల‌లు అజేయంగా ఉన్నాయి' అనే శీర్షిక‌తో వీడియోను పంచుకున్నారు నంద‌. వీడియో పోస్ట్ చేసిన గంట‌లోనే సంచ‌ల‌నంగా మారింది. 42 వేల మంది వీక్షించారు. 3 వేల‌కు పైగా లైక్స్ సంపాదించుకున్న‌ది. logo