సోమవారం 30 మార్చి 2020
National - Feb 13, 2020 , 11:43:46

ప్రాణాలు కాపాడిన హెల్మెట్‌

ప్రాణాలు కాపాడిన హెల్మెట్‌

చెన్నై : ఓ యువకుడి ప్రాణాలను హెల్మెట్‌ కాపాడింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ యువకుడు తన బైక్‌పై వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు ఆ బైక్‌.. అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లింది. బస్సు ముందు భాగంలోని ఎడమ టైర్‌ కింద బైక్‌ పడిపోయింది. బస్సు వేగంలో ఉండడంతో కొంచెం దూరం బైక్‌ను ఈడ్చుకెళ్లింది. అయితే ఈ ప్రమాదం నుంచి బైక్‌పై వెళ్తున్న ప్రయాణికుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద ఘటన అనంతరం బాధిత యువకుడు మాట్లాడుతూ.. తలకు హెల్మెట్‌ ధరించడం వల్ల తాను ప్రాణాలతో బయటపడ్డానని తెలిపాడు. హెల్మెట్‌ ధరించకపోతే ప్రాణాలు కోల్పోయేవాడినని అతను స్పష్టం చేశాడు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించి డ్రైవ్‌ చేస్తే మంచిదని పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్‌ ధరించి.. ప్రమాదాల బారి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలి. 


logo