శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 12:53:42

16 ఏండ్ల బాలిక‌పై యువ‌కుడి అత్యాచారం

16 ఏండ్ల బాలిక‌పై యువ‌కుడి అత్యాచారం

లక్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణం జ‌రిగింది. ఓ యువ‌కుడు 16 ఏండ్ల బాలిక‌ను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ జిల్లా భోపా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఓ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. శుక్ర‌వారం ఉదయం బాలిక‌కు లిఫ్ట్ ఇస్తాన‌ని చెప్పి బైక్ ఎక్కించుకున్న నిందితుడు అనంత‌రం ఓ నిర్జ‌న ప్ర‌దేశంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. విష‌యం ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరించి సాయంత్రం స‌మ‌యంలో బాలిక‌ను వ‌దిలేశాడు.

ఇంటికి చేరుకున్న బాలిక త‌ల్లిదండ్రుల‌కు విష‌యం చెప్ప‌డంతో వారు భోపా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబ‌స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. నిందితుడిపై ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌లోని సెక్ష‌న్ 363 (కిడ్నాపింగ్‌), సెక్ష‌న్ 364 (హ‌త్య చేయాల‌నే ఉద్దేశంతో అప‌హ‌ర‌ణ‌), సెక్ష‌న్ 376 (అత్యాచారం)తోపాటు పోక్సో చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.            

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.