బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 15:22:30

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో ఈసారి ఆడంబరంగా వేడుకలు వద్దని పేర్కొంది. కరోనా నిబంధనలు పాటించాలని, జన సందోహాల మధ్య వేడుకలు నిర్వహించ‌వద్దని, వీలైనంతగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, గవర్నర్లు, అన్ని శాఖల అధికారులకు లేఖలు రాసింది. ప్రతి ఏటా ఆగస్టు 15న అన్ని కార్యాలయాలతోపాటు ప్రతి వీధిలో జెండాలు ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ‌వ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించుకోవాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కరోనా నిబంధనలు తప్పక పాటించాలని సూచించింది.
logo