మంగళవారం 11 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 18:05:29

అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ

అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ

న్యూఢిల్లీ: ఈ నెల 8 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరించనున్నారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే వారి కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కొత్త మార్గదర్శకాలను ఆదివారం జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులంతా తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని తెలిపింది. మొదటి ఏడు రోజులు వారి సొంత ఖర్చులతో ప్రభుత్వం నిర్దేశించిన క్వారంటైన్ కేంద్రంలో, అనంతరం వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది. ఈ మేరకు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని న్యూఢిల్లీఎయిర్‌పోర్టు.ఇన్ వెబ్‌సైట్‌లో ప్రయాణానికి 72 గంటల ముందుగా సమర్పించాలని తెలిపింది. అలాగే కరోనా నిబంధనలు, మార్గదర్శకాలను తప్పక పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

logo