బుధవారం 03 జూన్ 2020
National - Apr 08, 2020 , 12:28:31

మాస్కులు కుడుతున్న కేంద్రమంత్రి భార్య, కూతురు

మాస్కులు కుడుతున్న కేంద్రమంత్రి భార్య, కూతురు

హైదరాబాద్: డిస్పోజబుల్ మాస్కులకన్నా ఉతికి మళ్లీమళ్లీ వాడుకునే మాస్కులే మేలని కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. గతవారం ప్రధాని నరేంద్రమోదీ కూడా మాస్కులు పెట్టుకోవాలని, అదికూడా ఇంటిదగ్గరే మాస్కులు కుట్టుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వీటిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భార్య మృదుల, కూతురు నైమిష ఇంట్లోనే తమ కుటుంబ సభ్యులకోసం, ఇతర అవసరార్థుల కోసం మాస్కులు కుట్టే పనిలో పడ్డారు. ఈ గడ్డురోజుల్లో మనమంతా సమాజం కోసం ఏదైనా చేయాలి. నా భార్య, కూతురు ఇంటిదగ్గర ఊరికే కూర్చోకుండా తమకోసం, ఇతరుల కోసం మాస్కులు కుట్టడం చూస్తుంటే గర్వంగా అనిపిస్తున్నది. నైపుణ్యం సంతరించుకునేందుకు, మెరుగుపర్చుకునేందుకు ఇంతకన్నా మంచి సమయం ఏముంటుంది అని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వి్ట్టర్‌లో పేర్కొన్నారు. కుట్టుమిషను దగ్గర కూర్చుని వారిద్దరూ తెల్లని గుడ్డతో మాస్కులు కుడుతున్న ఫొటోను కూడా ఆయన పెట్టారు.


logo