ఆదివారం 07 జూన్ 2020
National - Apr 06, 2020 , 15:20:42

క్లిష్ట సమయంలోనూ రాజకీయాలేనా..?

క్లిష్ట సమయంలోనూ రాజకీయాలేనా..?

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ సమాచార, రవాణాశాఖ  మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై అనవసరంగా నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. మీడియా సమావేశంలో మంత్రి నాని మాట్లాడుతూ...పక్క రాష్ట్రంలో  ఉంటున్న చంద్రబాబు దిగజారి ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రం ఎలా ఉన్నా ఆరోపణలే బాబుకు ముఖ్యం. ఇలాంటి సమయంలో చంద్రబాబు విమర్శలు చేయడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. 

వాలంటీర్ల వ్యవస్థతో ఎప్పటికప్పుడు అనుమానితులందరినీ గుర్తించాం. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంది. చంద్రబాబు బాధేమిటో  ఎవరికీ అర్థం కాదు? తీవ్రవాదికి, చంద్రబాబు మనస్థత్వానికి తేడా లేదు. కరోనా కేసుల లెక్కలు దాస్తున్నామని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బాబు  లెక్కలు చెబితే వారికీ పరీక్షలు చేయిస్తాం. ఇలాంటి ఆరోపణలు, తప్పుడు మాటలు బాబుకు అలవాటేనని మంత్రి పేర్కొన్నారు. 


logo