సోమవారం 30 మార్చి 2020
National - Mar 27, 2020 , 14:49:01

క్వారంటైన్‌కు సిద్ధమైతేనే రండి..

క్వారంటైన్‌కు సిద్ధమైతేనే రండి..

అమరావతి:  '40ఏండ్ల ఇండస్ట్రీ చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉండే చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ గురించి ఏం తెలుసు?  మార్చి 10న వాలంటీర్లతో జరిపిన సర్వేలో 15వేలు మంది ఉన్నారని తెలిసింది.  రెండోసారి నిర్వహించిన సర్వేలో 28వేలుగా గుర్తించాం. లాక్‌డౌన్‌ చేయబోతున్నారన్న పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్న వ్యక్తులంతా రాష్ట్రానికి వచ్చారు. దీన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారని' ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. 

'సరిహద్దుల వల్ల ఆందోళన చెందుతున్న ప్రజల విషయంలో కూడా కొన్ని మీడియాలు ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లోనూ రేటింగ్‌ల కోసం ప్రయత్నిస్తారా?  సమాజహితం అవసరం లేదా?  క్వారంటైన్‌ చేయకుండా ఎలా అనుమతిస్తాం.  ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండా ఇళ్లకు పంపితే ముప్పు తప్పదు. కళ్యాణ మండపాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తాం.  భోజనాలకు ఇబ్బంది పడే వారికి వాలంటీర్ల ద్వారా సాయం అందిస్తాం. ప్రతీ పౌరుడు స్వీయ నిర్బంధంలో ఉండాలి. చేతులెత్తి మొక్కుతున్నా.. 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధమైతేనే ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు రాష్ట్రంలోకి రావాలి. రాష్ట్ర సరిహద్దుల్లో ఎవరు కూడా ఘర్షణ వాతావరణం సృష్టించొద్దని'  నాని విజ్ఞప్తి చేశారు. 


logo