శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 21:13:36

కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి మృతి

కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి మృతి

న్యూఢిల్లీ:  కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో కరోనా చికిత్స పొందుతూ ఇవాళ సాయంత్రం మృతిచెందారు.  రెండు వారాల క్రితం ఆయనకు కరోనా సోకడంతో ఎయిమ్స్‌లో చేరారు. సెప్టెంబర్‌ 11న తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సురేశ్‌ తెలిపారు. తనకు కొవిడ్‌ లక్షణాలు కూడా లేకపోయినప్పటికీ  మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. దేశంలో కరోనాతో చనిపోయిన తొలి కేంద్ర మంత్రి సురేశే. 

బెలగావి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా సురేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  బెలగావి  నుంచి ఆయన నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. వారం క్రితం కర్ణాటక  బీజేపీ రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తీ కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. 


logo