గురువారం 04 జూన్ 2020
National - May 21, 2020 , 20:33:36

రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులతో మంత్రి నిరంజన్‌రెడ్డి సమావేశం

రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులతో మంత్రి నిరంజన్‌రెడ్డి సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. రైతుబంధు సమితి రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు వానకాలంలో వేయాల్సిన పంటల విషయమై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాల వారీగా ఎలాంటి పంటలు వేయాలి, మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలు వేసేలా రైతులను ఎలాంటి సహకారం అందించాలి అనే అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డితోపాటు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.logo