మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 09, 2020 , 13:39:28

ఖురాన్ కాపీల పంపిణీ.. మంత్రిని విచారిస్తున్న క‌స్ట‌మ్స్‌శాఖ‌

ఖురాన్ కాపీల పంపిణీ..  మంత్రిని విచారిస్తున్న క‌స్ట‌మ్స్‌శాఖ‌

హైద‌రాబాద్‌: కేర‌ళ‌కు చెందిన మంత్రి కేటీ జ‌లీల్ ఇవాళ క‌స్ట‌మ్స్ అధికారుల ముందు విచార‌ణకు హాజ‌ర‌య్యారు.  యూఏఈ కాన్సులేట్ నుంచి ఖురాన్ కాపీలు తీసుకువ‌చ్చి, వాటిని రాష్ట్రంలో పంపిణీ చేసిన అంశంలో మంత్రిపై విచార‌ణ చేప‌ట్టారు.  కొచ్చిలోని క‌స్ట‌మ్స్ ఆఫీసు ముందు ఆయ‌న ఇవాళ హాజ‌ర‌య్యారు.  ఫారిన్ కాంట్రిబ్యూష‌న్ రెగ్యూలేష‌న్ యాక్ట్‌ను మంత్రి ఉల్లంఘించినట్లు క‌స్ట‌మ్స్ అధికారులు గుర్తించారు.  క‌స్ట‌మ్స్‌తో పాటు ఈడీ అధికారులు.. ఖురాన్ పుస్త‌కాల పంపిణీ అంశంపై ప్ర‌శ్న‌లు వేయ‌నున్నారు. ఇటీవ‌ల కేర‌ళ‌ను కుదిపేసిన గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు నిందితులు స్వ‌ప్నా సురేశ్‌తో జ‌రిపిన ఫోన్ సంభాష‌ణల గురించి కూడా అధికారులు మంత్రిని ప్ర‌శ్నించ‌నున్నారు. ఈడీ, ఎన్ఐఏతో సంబంధం లేకుండా.. క‌స్ట‌మ్స్ అధికారులు ప్ర‌త్యేక ప్ర‌శ్నావ‌ళిని త‌యారు చేశారు.  గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు నిందితుడు స‌రిత్ వెల్ల‌డించిన విష‌యాల ఆధారంగా కూడా మంత్రిని ప్ర‌శ్నించ‌నున్నారు. యూఏఈ కాన్సుల్ జ‌న‌ర‌ల్‌తో మంత్రి జ‌లీల్ సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు స‌రిత్ పోలీసుల‌కు వెల్ల‌డించారు.  దీంతో గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు ఆస‌క్తిక‌రంగా మారింది.